మంత్రి రోజా దీపావళి వేడుకలు.. లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు
Roja: ఎర్రతామరపూలతో లక్ష్మీపూజ.. బాణాసంచాతో దీపావళి సంబరాలు
మంత్రి రోజా దీపావళి వేడుకలు.. లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు
Roja: మంత్రి రోజా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలకడలిలో లక్ష్మీదేవి ఉద్భవించినరోజు దీపావళేనని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవి కొలువుదీరి ఉండే ఎర్ర తామరపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీదేవిని ఆహ్వానించారు. ప్రజలకు సర్వశుభాలు సిద్ధించాలని మంత్రి రోజా వేడుకున్నారు. లక్ష్మీపూజ అనంతరం బాణాసంచా వేడుకలు జరిపారు.