Roja: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడు.. అసెంబ్లీ గేట్ కూడా..
Minister Roja: వీకెండ్ టూరిస్ట్ అంటూ మరోసారి సెటైర్లు
Roja: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడు.. అసెంబ్లీ గేట్ కూడా..
Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఫైరయ్యారు మంత్రి రోజా. ముఖ్యమంత్రి కావడమంటే సినిమా షూటింగ్లో సీన్ లాంటిది కాదని ఎద్దేవా చేశారు. పవన్‌ను కళాకారుడిగా గౌరవిస్తానని అయితే రాజకీయాలంటే పూర్తిస్థాయిలో పనిచేయాలని చురకలంటించారు. జనసేనాని, అతని సోదరులు రాజకీయాలకు సూట్ కారన్న రోజా నిలబడ్డ రెండు చోట్లా పవన్ ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేని పవన్ జగన్‌ను ఏం ఓడిస్తావని సెటైర్ వేశారు. అంతకుముందు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కళాకారులతో కలిసి రోజా సందడి చేశారు. డ్యాన్స్ చేస్తూ కళాకారులను ఉత్సాహ పరిచారు.