Roja: పవన్ కళ్యాణ్ మాటలు బాధ్యత రాహిత్యం
Roja: పవన్ కల్యాణ్ దాడులు చేయిస్తే.. చంద్రబాబు, పురంధేశ్వరి...
Roja: పవన్ కళ్యాణ్ మాటలు బాధ్యత రాహిత్యం
Roja: పవన్ కళ్యాణ్ మాటలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. అమరావతి టీడీపీ రాజధాని అని పవన్ కల్యాణ్ చెప్పలేదా అని ఆమె ప్రశ్నించారు. పవన్ దృష్టిలో విశాఖ, కర్నూలే రాజధానులని పవన్ కల్యాణ్ చెప్పారని, ఇప్పుడేమో ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.గతంలో జనవాణి జరిపినప్పుడు పవన్ కల్యాణ్ ర్యాలీలు చేశారా అని, ఇప్పుడు ర్యాలీలు చేయడం వెనుక కుట్ర లేదా రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దాడులు చేయిస్తే.. చంద్రబాబు, పురంధేశ్వరి ఆయన్ని పరామర్శించడం ఏంటో అర్థం కాలేదన్నారు. ఇలాంటి రౌడీ రాజకీయాలకు భయపడమని, జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన విధానాల కోసం బలంగా నిలబడతానని రోజా చెప్పారు.