Kodali Nani: దళిత మహిళ చనిపోతే లోకేష్ శవరాజకీయాలు చేయడానికి వెళ్లాడు
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ‌్యలు చేశారు.
Kodali Nani: దళిత మహిళ చనిపోతే లోకేష్ శవరాజకీయాలు చేయడానికి వెళ్లాడు
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ‌్యలు చేశారు. దళిత మహిళ చనిపోతే లోకేష్ శవ రాజకీయాలు చేయడానికి వెళ్లాడని విమర్శించారు. మహిళ చనిపోయిన 12గంటల్లో నిందితుడిని పట్టుకున్నామని, దిశా చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సీఎం పరామర్శించడానికి వెళ్లలేదన్న లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని లోకేష్ ప్రశ్నించాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ సీఎంకు సవాల్ విసరడమేంటని కొడాలి నాని ఎద్దేవా చేశారు.