సాంబిరెడ్డి మరణానికి, ఉల్లికి సంబంధం లేదు: మంత్రి కొడాలి నాని

గుడివాడ రైతు బజార్‌లో గుండెపోటుతో మరణించిన సాంబిరెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మంగళవారం ఉదయం పరామర్శించారు.

Update: 2019-12-10 06:13 GMT
పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని

గుడివాడ రైతు బజార్‌లో గుండెపోటుతో మరణించిన సాంబిరెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మంగళవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్బంగా సాంబిరెడ్డి ఎలా మరణించారనే విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు సాంబిరెడ్డి సబ్సిడీ ఉల్లికోసం వెళ్లి తొక్కిసలాటలో మృతి చెందలేదని.. గుండెపోటు కారణంగానే మృతిచెందినట్టు స్పష్టం చేశారు.

అయితే ఉల్లిపాయల కోసం వెళ్లి క్యూ లైన్లో నిలబడి తొక్కిసలాటలో మృతిచెందాడని చెప్పాలంటూ టీడీపీ నేతలు మృతుడి కుటుంసభ్యులమీద ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అయితే వాస్తవంగా సాంబిరెడ్డి గుండెపోటుతో మృతిచెందినట్టు మంత్రి తెలిపారు. సాంబిరెడ్డి కుటుంబం అర్థికంగా ఉన్నత స్థితి లోనే ఉందన్నారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో కండక్టర్ పని చేసి..

గతంలో ఒకసారి గుండెపోటు రావడంతో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని చెప్పారు. ఆయనకు ఆర్ధిక కష్టాలంటూ ఏమి లేవని చెబుతూ.. సాంబిరెడ్డి ఇద్దరు కుమారులు హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు, గుడివాడలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించుకొని ఇక్కడే 15 ఎకరాల్లో చేసుకుంటున్న సాంబిరెడ్డి.. 25 రూపాయల కిలో ఉల్లిపాయలు కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేదని..

కేవలం రైతుబజారుకి వెళ్లి గుండెపోటుతోనే మృతిచెందారని కుటుంబసభ్యులే స్వయంగా చెప్పారని తెలిపారు. వాస్తవాలు తెలిసి కూడా ప్రభుత్వం మీద బురదజల్లాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అలాగే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా ప్రభత్వంపై విమర్శలు చేయడం దిగజారుడుతనమన్నారు. కాగా గుడివాడకు చెందిన సాంబిరెడ్డి నిన్న ఉదయం రైతు బజార్లో మృతిచెందారు.

Tags:    

Similar News