Kanna Babu: జనసేనానిపై వైసీపీ మంత్రి కన్నబాబు విమర్శలు
Kanna Babu: పవన్‌లో ఓటమి బాధ ఇంకా పోలేనట్టుంది: మంత్రి కన్నబాబు
పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన మినిస్టర్ కన్నబాబు (ఫోటో ది హన్స్ ఇండియా)
Kanna Babu: జనసేనాని పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రుల ఎదురుదాడి కంటిన్యూ అవుతోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్‌లో ఓటమి బాధ ఇంకా పోలేనట్టుందంటూ కౌంటర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌లో సీఎం జగన్ పట్ల జలసీ అణువణువునా కనిపిస్తోందని సెటైర్ వేశారు. అలాగే, చంద్రబాబు, పవన్ మధ్య బంధం కొనసాగుతూనే ఉందని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కన్నబాబు.