జనసేనాని పవన్ కల్యాణ్‌కు మంత్రి దాడిశెట్టి రాజా స్ట్రాంగ్ కౌంటర్
*పవన్, బాబు అమరావతిలో అల్లర్లు సృష్టించారు : మంత్రి దాడిశెట్టి
జనసేనాని పవన్ కల్యాణ్‌కు మంత్రి దాడిశెట్టి రాజా స్ట్రాంగ్ కౌంటర్
Dadisetti Raja: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు ప్రకటించినందుకే పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అల్లర్లు సృష్టించారని మంత్రి రాజా ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారని వ్యాఖ్యానించారు.
కోనసీమ అల్లర్లలో జనసేన, టీడీపీ సానుభూతి పరులే అరెస్ట్ అయ్యారని చెప్పారు. అలాగే, కొన్ని కులాలను వైసీపీకి వర్గ శత్రవులని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని.. ఎవరు, ఎవరికి శత్రువులని మంత్రి రాజా ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల, మతాల ప్రజలు తమ పక్షానే ఉన్నారని చెప్పారు. రాష్ట్రమంతా అధోగతి పాలైపోవాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారని దుయ్యబట్టారు.