విజయనగర ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: ఆనందగజపతిరాజు ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు
విజయనగర ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: విజయనగరం ఉత్సవాలను ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో జ్యోతి వెలిగించి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల ద్వారా జిల్లా కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్వహించి, కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముందుగా పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి ఉత్సవ రాలీని జెండా ఊపి ప్రారంబించారు. అనంతరం ఆనంద గజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, ఇందుకూరి రఘు రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు కడుబండి శ్రీనివాస రావు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ రేవతి దేవి పాల్గొన్నారు.