మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి త్వరలో నిపుణలు కమిటీ
మత్స్యకారుల సమస్యలపై మంత్రులు సిదిరి అప్పలరాజు, అవంతి సమీక్ష
Minister Sidiri Appala Raju (file image)
మత్యకారుల సమస్యల పరిష్కరం కోసం త్వరలో నిపుణులతో ఒక కమిటీ వేస్తున్నట్లు ఏపీ మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పల రాజు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మత్స్యకారుల సమస్యలపై మంత్రులు సిదిరి అప్పలరాజు, అవంతి శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల మధ్య చిచ్చురేపుతున్న రింగు వలల వివాదంపై ఇరువర్గాల మత్స్యకారుల వాదనలు మంత్రులు అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో 8 కిలోమీటర్ల వరకు రింగ్ వలలతో వేట చేయడానికి వీలులేదని మత్య్సకారులను ఆదేశించినట్లు మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు.