నగరంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలి: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నగరంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

Update: 2019-12-15 04:36 GMT
మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు: నగరంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు నగరంలోని ఇస్కాన్‌సిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి ఆయన నగరపాలక సంస్థ కమిషనర్‌ మూర్తి, నుడా వీసీ బాపిరెడ్డి, ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ హెల్త్‌, శానిటేషన్‌ విభాగాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నగరంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలో సిమెంటు రోడ్లు వేయని ప్రాంతాలలో క్వారీ డస్ట్‌తో రోడ్లు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మినరల్‌ వాటర్‌ను త్వరలోనే సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో చెట్లు నాటడమే కాకుండా, వాటిని పెంచే బాధ్యత కూడా చేపట్టాలని, ఈ విషయంలో ప్రజలను కూడా చైతన్య పరచాలని కోరారు. నెల్లూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ఉన్నారని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇబ్బందికరంగా ఉన్నవాటిని తొలగించి, క్రమపద్ధతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ద్వారకానాథ్‌, రూప్‌కుమార్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Tags:    

Similar News