ఎప్పుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మెగా కుటుంబంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మెగా కుటుంబానికి పెద్ద అభిమానినని చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లను తాను ఎంతో ఆరాధించేవాడినని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మెగా ఫ్యామిలీ పట్ల తనకున్న ప్రేమ, ఆప్యాయత కొనసాగుతుందని పునరుద్ఘాటించారు అనిల్ కుమార్ యాదవ్. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి చెప్పారు. రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలలో పవన్‌కళ్యాణ్‌ను తాను వ్యతిరేకించాల్సి వచ్చిందని అన్నారు. సినిమాలోకి వచ్చేటప్పుడు తన అన్న మెగాస్టార్ పేరును అడ్డుపెట్టుకొని వచ్చిన పవన్..
రాజకీయాల్లో మాత్రం తన తండ్రి వెంకట్రావు పేరును ఉపయోగించడం ఏమిటని అభిప్రాయపడ్డారు. ఇందులో పవన్ కళ్యాణ్ డబుల్ స్టాండర్డ్ కనిపిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయ నాయకుడు అయితే దర్నా, నిరసనలు సమస్యను పరిష్కరించలేవని గతంలో అన్నారు.. ఇప్పుడు అదే పనులు ఎందుకు చేస్తున్నారు.. ఇది డబుల్ స్టాండర్డ్ కాదా అని ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్లలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను విమర్శించడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌తో మాకు పొత్తులు లేవు. మా పల్స్. మా నాయకుడిపై నమ్మకం ఉందని అన్నారు మంత్రి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అవకాశవాది అని అనిల్ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ రాజకీయ నాయకుడు కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ అబద్దం చెప్పిందని, నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తవుతుందని హామీ ఇచ్చారు.