ధవళేశ్వరం బ్యారేజివద్ద వరద పరిస్థితిపై మంత్రి అంబటి క్షేత్రస్థాయి పరిశీలన
*ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అంబటి ఆదేశాలు
ధవళేశ్వరం బ్యారేజివద్ద వరద పరిస్థితిపై మంత్రి అంబటి క్షేత్రస్థాయి పరిశీలన
Ambati Rambabu: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా పరిశీలించారు. ఎంపీ భరత్‌రామ్, కలెక్టర్ మాధవీలత, ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్‌తో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. వరదనీరు దిగువకు విడుదల సమయంలో ముంపుప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ముంపు ప్రాంతాల్లో బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఇళ‌్లకే పరిమితమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విషయంలో వెనుకాడవద్దని సూచించారు.