కొవ్వూరులో ఉద్రిక్తత.. లాఠీఛార్జ్..

Update: 2020-05-04 06:39 GMT

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వలస కార్మికులు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలంటూ ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌ ,ఒడిశాకు చెందిన దాదాపు 300మంది వలస కూలీలు నిరసనకు దిగారు. తమను స్వంత రాష్ట్రాలకు పంపాలంటూ డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

కూలీలను తరలించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేంత వరకూ పంపించలేమని చెప్పారు. అయితే శాంతించని వలస కూలీలు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరి దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు వలస కూలీలపై లాఠీ ఛార్జ్ చేశారు. వారందర్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళనకు దిగిన వారంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పని చేస్తున్నారు.

Tags:    

Similar News