కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఆంధ్రాలోని మావోయిస్టులు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మావోయిస్ట్ (సిపిఐ-మావోయిస్ట్) కాల్పుల విరమణను ప్రకటించింది.

Update: 2020-04-06 11:48 GMT

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మావోయిస్ట్ (సిపిఐ-మావోయిస్ట్) కాల్పుల విరమణను ప్రకటించింది.. దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) వ్యాప్తి చెందుతున్నందున భద్రతా దళాలపై దాడి చేయబోమని ప్రకటించింది.

ఈ మేరకు సిపిఐ (మావోయిస్టు) మల్కన్‌గిరి-కొరాపుట్-విశాఖ బోర్డర్ (ఎంకెవిబి) డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఆదివారం తెలుగులో చేతితో రాసిన ఒక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ మీడియాకు విడుదల చేశారు.

అందులో "మా పార్టీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (సిపిఐ-మావోయిస్టుల సాయుధ విభాగం) , పార్టీకి చెందిన వివిధ సంస్థలు ప్రస్తుతం కాలంలో భద్రతా దళాలపై ఎలాంటి దాడులకు పాల్పడకూడదని నిర్ణయం తీసుకున్నాయి" అని ఆ ప్రకటన తెలిపింది.

అయితే భద్రతా దళాలు మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.. ఈ ప్రకటనకు ఐదు రోజుల్లో ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాము" అని కైలాసం లేఖలో పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణ ప్రతిపాదనను పౌర హక్కుల కార్యకర్తలు స్వాగతించారు, కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు.

సివిల్ లిబర్టీస్ కమిటీ (సిఎల్‌సి) తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ గడ్డం లక్ష్మణ్, ఎపి చీఫ్ వి చిట్టాబాబు సంయుక్త ప్రకటనలో ఇలా అన్నారు: "ఈ ప్రతిపాదనను అంగీకరించడం ద్వారా శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి." అని పేర్కొన్నారు.


Tags:    

Similar News