జనవరి 1న సామూహిక లొంగుబాటు: మావోయిస్టుల కీలక ప్రకటన

మావోయిస్టులు నిర్ణయం ప్రకటించారు. ఎంఎంసీ (మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన లేఖలో జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు.

Update: 2025-11-28 05:45 GMT

మావోయిస్టులు నిర్ణయం ప్రకటించారు. ఎంఎంసీ (మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన లేఖలో జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు.

వ్యక్తిగతంగా కాదు, అందరూ కలిసి ఒకేసారి లొంగుబాటు చేస్తామని చెప్పారు. అగ్ర నాయకులు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న లొంగుబాటు విజ్ఞప్తిని పరిగణించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని పూర్తిగా విరమించుకుంటామని, ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాస పథకాన్ని అంగీకరించడానికి సిద్ధమని చెప్పారు. తాము సహకారం లభించే రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అంతేకాక, అందరూ లొంగే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అదనపు ఆపరేషన్లలో దిగకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని గత వారం మావోయిస్టులు పంపిన లేఖలో కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News