AP Elections: మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్

AP Elections: పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలపై టీడీపీ, వైసీపీ కన్ను

Update: 2021-03-03 09:53 GMT

Representational Image

AP Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. తూర్పుగోదావరి జిత్తా పిఠాపురం, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో జెండా ఎగురవేయడానికి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ రెండు స్థానాలను గతంలో టీడీపీ కైవశం చేసుకోగా ఈ సారి విజయం సాధించడానికి వైసీపీ పావులు కదుపుతోంది. పిఠాపురంలో 30 వార్డులుంటే, గొల్లప్రోలులో 20 వార్డులున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లోనూ ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. వీటితోపాటు జనసేన, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి.

మరోవైపు పిఠాపురం పుర పీఠంపై ఇప్పటివరకు ఆరు సార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది. గత పాలకవర్గంలో విజయం సాధించిన టీడీపీ ఈసారి కూడాతన అధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అటు.. గత ఎన్నికల్లో ఐదు స్థానాలతోనే సరిపెట్టుకున్న వైసీపీ ఈసారైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇటు.. జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి నలుగురు ఉమ్మడి అభ్యర్థులు కూడా విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అటు గొల్లప్రోలు నంగర పంచాయతీకి ఇది రెండో ఎన్నికల. 20 స్థానాలున్న మున్సిపాలిటీలో గత పాలకవర్గం టీడీపీ అనూహ్యంగా కౌవసం చేసుకుంది. గత ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డి టీడీపీ, వైసీపీ చెరో పది స్థానాలు దక్కించుకున్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే వర్మ ఓటుతో పీఠం టీడీపీకి దక్కింది. దీంతో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. అయితే ఇక్కడ కూడా జనసేన ఏడు వార్డుల్లోనూ, బీజేపీ మూడు వార్డుల్లోనూ బరిలో నిలిచాయి.

ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధితోపాటు ప్రస్తు వైసీపీ పాలనలో అవకతవకలు ప్రధానంగా ఎత్తిచూపుతూ టీడీపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. అయితే.. వైసీపీ మాత్రం ఇంకాస్త దూకుడుగానే ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రాలుగా అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇటీవల పంచిన ఇళ్ల పట్టాలు, ఇంటింటి రేషన్. మహిళలకు రుణాలు, అమ్మఒడి వంటి పథకాలు ప్రభావం చూపుతాయలని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే.. రెండు పట్టణాల్లోని ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News