రక్షణ కోసం మహిళా మిత్రా కమిటీలు
మహిళలు చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు నియమించిన మహిళా మిత్ర కమిటీ సమర్థ సేవలు అందించాలని డీఎస్పీ ఎన్. సత్యానం దం ఆకాంక్షించారు.
గుడివాడ: మహిళలు చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు నియమించిన మహిళా మిత్ర కమిటీ సమర్థ సేవలు అందించాలని డీఎస్పీ ఎన్. సత్యానందం ఆకాంక్షించారు. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆయన డివిజన్ పరిధిలోని మహిళా మిత్ర కమిటీల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళ మిత్ర కమిటీలు అయా ప్రాంతాల్లోని అతివల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
మహిళలు, చిన్నారులకు సంబంధించిన చట్టాలు కేసుల గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్ నొక్కితే చాలు పోలీసులకు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అధిక సంఖ్యలో మహిళలు, యువతులు సైబర్ స్పైస్ లో లో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.మహిళా మిత్ర సభ్యులు తమ దృష్టికి వచ్చే సమస్యలను పోలీసుల సహకారంతో పరిష్కరించాలన్నారు.