Andhra Pradesh: క్యాన్సర్ సంరక్షణలో అధునాతన సాంకేతికతలు

* ఏపీలో క్యాన్సర్ సంరక్షణ ప్రమాణాలు * పెంచుతున్నామన్న మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కృష్ణ

Update: 2021-09-04 10:32 GMT

మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ (ఫోటో: ది హన్స్ ఇండియా )

Andhra Pradesh: క్యాన్సర్ సంరక్షణలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ రంగాలలో అధునాతనమైన సాంకేతికతలు ఆవిష్కరించినట్లు మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీ కృష్ణ తెలిపారు. ఏపీలో అనేక క్యాన్సర్ సంరక్షణ ప్రమాణాలు పెంపొందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటంలో తమ ఆసుపత్రి ముందంజలో ఉందన్నారు. పాత పద్దతి అయిన PET-CT స్థానంలో తమ ఆసుపత్రిలో ప్రత్యేకమైన "టైం ఆఫ్ ఫ్లైట్ PET-CT" ని ఆవిష్కరించినట్లు తెలిపారు. PET-CT అనేది కార్డియాలజీ, న్యూరోలజీ, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలలో అత్యంత కీలకమైన ఇమేజింగ్ విధానమని వివరించారు.

Tags:    

Similar News