Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు

Nellore: మూలస్థానేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

Update: 2023-02-18 07:47 GMT

Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు

Nellore: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు మహాశివుని పూజలు తరిస్తున్నారు. ఆలయాల్లో దీపారాధనలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగే మహాలింగోద్భవ మహత్ కార్యక్రమానికి ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నెల్లూరు నామధేయానికి మారుపేరుగా ఉన్న మూలస్థానేశ్వరాలయంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని విశేష పూజలు చేస్తున్నారు.

Tags:    

Similar News