Tirupati: తిరుమలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం

Tirupati: అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల అలంకరణ

Update: 2023-02-20 04:30 GMT

Tirupati: తిరుమలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం

Tirupati: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు రాత్రి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ముక్కంటి ఆలయంలోని అలంకార మండపం నందు స్వామి అమ్మవార్లను అత్యంత వైభవంగా అలంకరించారు. పల్లకిలో స్వామి అమ్మవార్లను నారద పుష్కరిణి వద్దకు మోసుకుని వెళ్లగా అక్కడ దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో వెలుగుతున్న తెప్పలపై స్వామి అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా స్వామివారి పుష్కరిణి భక్త జనంతో  కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకర అను ఓంకారనాదంతో స్వామివారి పుష్కరిణి మారుమోగింది. అనంతరం స్వామి అమ్మవార్లు తెప్పలపై విహరించి భక్త జనులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు మరియు ఆలయ ఇవో సాగర్ బాబు దంపతులు శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు ఆలయాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News