Weather Report: మన్యం జిల్లాను వణికిస్తున్న చలి
Weather Report: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
Weather Report: మన్యం జిల్లాను వణికిస్తున్న చలి
Weather Report: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గడిచిన నాలుగు రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీ ల వరకు ఉండగా... కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పడిపోయింది. వీటితో పాటు చలిగాలులు పెరగడంతో అన్ని వయసులవారు ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీలో రాత్రి వేళల్లో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు తెలుస్తోంది.
దీనితో సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉదయం ఏడు గంటల వరకు మన్యం జిల్లా అంతటా మంచు దుప్పటి కమ్ముకుంటోంది. దీనితో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు జాగ్రతగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు.