హిందూ మహాసముద్రంలో 24 గంటల్లో అల్పపీడనం

Update: 2019-12-07 02:36 GMT

మాల్దీవులు, దానిని అనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో మాల్దీవుల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని.. సీమలో పలుచోట్ల చలి తీవ్రత పెరిగిందని పేర్కొంది.

మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తాంధ్రలో ప్రస్తుతం చలి గాలులు వీస్తున్నాయని. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని. దీంతో విశాఖ ఏజెన్సీలో మంచు కురవడంతోపాటు చలి తీవ్రత పెరిగిందని శుక్రవారం విశాఖలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో చలి పెరిగి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News