Nara Lokesh: ఏపీలో గంజాయిని అరికట్టాలని గవర్నర్‌కు విన్నవించిన లోకేశ్
Nara Lokesh: గుడిలో.. బడిలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది
Nara Lokesh: ఏపీలో గంజాయిని అరికట్టాలని గవర్నర్‌కు విన్నవించిన లోకేశ్
Nara Lokesh: ఏపీని వైసీపీ నాయకులు గంజాయి క్యాపిటల్‌గా మార్చారని, గుడిలో, బడిలో.. ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఏపీలోని గంజాయి రవాణా, సరఫరాను అరికట్టాలని, తన పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ లోకేష్ గవర్నర్‌ను కలిసి విన్నవించారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ నుంచే దిగుమతి చేసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారని ఆరోపించారు.
తన పాదయాత్ర సందర్భంగా ఓ కూతురు గంజాయికి బానిస అయిందంటూ ఓ తల్లి ఆవేదన వ్యక్తపరిచిందన్నారు లోకేష్... సీఎం నివాసానికి సమీపంలోనే ఓ గంజాయి బ్యాచ్ ఓ ఆడబిడ్డ ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకాల వెనుక వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు సౌతం ఉన్నారని దుయ్యబట్టారాయన.