కరోనా వైరస్ : అమరావతి గ్రామాల్లో సమాచారం ఇవ్వకుండా ఇళ్లలో ఆశ్రయమిచ్చారు..

రాష్ట్రంలో 45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Update: 2020-03-28 18:09 GMT
Gowtham Sawang (File Photo)

రాష్ట్రంలో 45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాజధాని గ్రామాల్లో సమాచారం ఇవ్వకుండా ఇళ్లలో వున్నట్లు తెలిసిందని ఏపీ డీజీపీ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అనుమతి లేకుండా ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిపై కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సమాజానికి ఎవరూ నష్టం చేయొద్దని ఆయన హితవు పలికారు. ఆశ్రయమిశ్చినవారు వెంటనే వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైరస్‌ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్‌ చేద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. స్వీయ నిర్బంధంలో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు. పోలీసులకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలన్నారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉందామన్నారు. ఖాళీ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందన్నారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండేలా ఆదేశాలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఏపీ డీజీపీ సవాంగ్ సూచించారు. తాము చేస్తున్న ప్రయత్నం ప్రజల కోసమే అని తెలుసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News