పదోతరగతి విద్యార్ధులకు రేడియో పాఠాలు రేపటి నుంచి

లాక్ డౌన్ కారణంగా స్కూలుకు వెళ్ళే అవకాశం కోల్పోయిన పదోతరగతి విద్యార్థులకు రేడియోలో తరగతులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

K V D Varma
Updated on: 21 April 2020 4:22 PM IST
పదోతరగతి  విద్యార్ధులకు రేడియో పాఠాలు రేపటి నుంచి
X
Representational image

లాక్ డౌన్ కారణంగా స్కూలుకు వెళ్ళే అవకాశం కోల్పోయిన పదోతరగతి విద్యార్థులకు రేడియోలో తరగతులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా.. పదోతరగతి విద్యార్థుల కోసం బుధవారం నుంచి మే 15వ తేదీ వరకు రేడియోలో పాఠాలు ప్రసారం చేయనున్నట్లు సమగ్రశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు చినవీరభద్రుడు తెలిపారు.

తెలుగు ఏప్రిల్‌ 22 నుంచి 24వరకు,

♦ హిందీ 25-27,

♦ ఆంగ్లం 28-మే1,

♦ గణితం మే 2-5,

♦ భౌతికశాస్త్రం 6-8,

♦ జీవశాస్త్రం 9-11,

♦ సాంఘికశాస్త్రం 12-15 వరకు ఉంటుందన్నారు.

రోజూ ఉదయం 11గంటల 5 నిమిషాల నుంచి 11గంటల 35 నిమిషాల వరకు పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.


K V D Varma

K V D Varma

Next Story