స్థానిక ఎన్నికల వ్యవధిపై ఈసీ కీలక నిర్ణయం

ఏపీ జరగబోయే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ కుదిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Update: 2020-02-08 03:20 GMT

ఏపీ జరగబోయే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ కుదిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ కాల వ్యవధిని 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఈసీ కార్యదర్శి రామసుందరరెడ్డితో కలిసి శుక్రవారం 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నోటిఫికేషన్‌ జారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఈ ప్రక్రియను 20 రోజుల్లో ముగించనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను, మార్గదర్శకాలను అమలుచేయడంపై దృష్టి సారించాలని తెలిపారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలతో ఒకేసారి జరిగితే అదనపు యంత్రాంగాన్ని సమకూర్చుకునేలా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, రమేష్‌కుమార్‌ జిల్లా చెప్పారు. 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించాల్సి ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్‌ అధికారులకు తెలిపారు. మార్చిలో ఇంటర్, టెన్త్‌ పరీక్షలు ఉండడంతో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా షెడ్యూల్‌ ఉంటుందని రమేష్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని త్వరలో నిర్వహించనున్న స్థానిక, పట్టణ, నగర ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ప్రణాళికలతో ఉండాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఓటర్ల జాబితా నవీకరణ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, బ్యాలెట్‌ బాక్సులు.. ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవడంపై కలెక్టర్లు ప్రధానంగా దృష్టిసారించాలన్నారు.


 

Tags:    

Similar News