విశాఖలో గ్రామ వాలంటీర్ ఇంట్లో మద్యం బాటిళ్లు లభ్యం
* నారాయణరాజుపేటలో 300 మద్యం సీసాలు స్వాధీనం * వాలంటీర్ అప్పలరాజును అరెస్ట్ చేసిన పోలీసులు
representational image
విశాఖలో గ్రామ వాలంటీర్ ఇంట్లో భారీగా మధ్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. భీమునిపట్నం మండలం నారాయణరాజుపేటలో వాలంటీర్ అప్పలరాజు ఇంట్లో అక్రమ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. భీమిలి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి సుమారు 3వందల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాలంటీర్ అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు.వీటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు అంచనా వేస్తున్నారు.