ఏపీ సీఎస్‌కు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
IPS AB Venkateswara Rao: *తన సస్సెన్షన్‌పై హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని లేఖ రాసిన ఏబీవీ
ఏపీ సీఎస్‌కు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
IPS AB Venkateswara Rao: ఏపీ సీఎస్ సమీర్ షర్మకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు లేఖ రాశారు. తన సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని వెంకటేశ్వర్ రావు తెలిపారు. సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే నా సస్పెన్షన్ రీవోక్ చేయాలనే విషయాన్ని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. జీవోను సవరించాలన్న విజ్ఞప్తిని ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదని.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు