దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి: వామపక్షాలు

జనవరి 8న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ ప్రాంత బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు విజ్ఞప్తి చేస్తూ సోమవారం మధ్యాహ్నం నక్కపల్లిలో కర పత్రాలు పంపిణీ చేశారు.

Update: 2020-01-07 05:44 GMT
సీపీఐ మండల కార్యదర్శి అజయ్, సీపీఎం మండల కన్వీనర్ రాజేష్, నరసయ్య, నానాజీ

నక్కపల్లి: జనవరి 8న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ ప్రాంత బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు విజ్ఞప్తి చేస్తూ సోమవారం మధ్యాహ్నం నక్కపల్లిలో కర పత్రాలు పంపిణీ చేశారు. దుకాణాలకు, హోటళ్లకు, స్కూళ్లకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు, కార్యాలయాలకు వెళ్లి ఈ కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తూ వ్యాపార, విద్య ,వైద్యం, ఉపాధి దెబ్బతీస్తుందని అన్నారు.

బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు దేశ వ్యాప్త సమ్మెకు, గ్రామీణ ప్రాంత బంద్ కు పిలుపునిచ్చాయి అని అన్నారు. అలాగే కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కోట్లాది మంది కార్మికులు సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వగా, సుమారు 200 వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంత బంద్ కు పిలుపునిచ్చాయి అని తెలిపారు. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి అజయ్, సీపీఎం మండల కన్వీనర్ రాజేష్, నాయకులు నరసయ్య, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News