Corona virus: ప్రార్థనలకు వెల్లొచ్చిన కర్నూలు వ్యక్తి మృతి
దేశ రాజధాని ఢిల్లీ ఉన్న నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో ప్రతీ ఏటా ప్రత్యేక ప్రార్థనలు జరగుతుంటాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఉన్న నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో ప్రతీ ఏటా ప్రత్యేక ప్రార్థనలు జరగుతుంటాయి. మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ముస్లింలు ఈ ప్రార్థనలకు అధికంగా హాజరవుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ముస్లిమ్స్ లో అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లోచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి సుమారు 800 మంది, తెలంగాణ నుంచి 1000 మందికి పైగా ఈ ప్రార్థనలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే గత మార్చి నెలలో నిర్వహించిన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ తేలుతుండడంతో అందరినీ ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లాలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరినీ అధికారులు గుర్తించి కరోనా టెస్టులు చేయించడంతో.. అవసరమైన వారిని క్వారంటైన్‌కి తరలిస్తున్నారు. అయితే వారిలో కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి బుధవారం ఆస్పత్రిలో మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తికి కరోనా నెగిటివ్ అని తేలినట్లు అధికారులు అంటున్నారు. ఆయన రక్తపోటు, డయాబెటిస్, హెమిప్లెజియా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. అందువల్లే మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తిని అధికారులు ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. గత 27న ఆయనకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆయన కరోనా వైరస్ సోకలేదని , అనారోగ్యంతో చనిపోయారని కర్నూల్ కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.