కుప్పంలో కలకలం.. వైసీపీ నేత హత్యకు స్కెచ్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గానికి చెందిన వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు పత్యర్థులు పథక రచన చేశారు.

Update: 2020-02-22 06:00 GMT
కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర

చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గానికి చెందిన వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు పత్యర్థులు పథక రచన చేశారు. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు స్కెచ్ వేశారు. అడ్వాన్స్‌గా కొంత డబ్బును చెల్లించారు. విద్యాసాగర్ తన హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని ఓ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ హత్యకు సుపారీ ఇచ్చింది ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యాసాగర్ 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు. ఆయన హత్య కుట్ర విషయం తెలియడంతో కుప్పం ఉలిక్కిపడింది. ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యం కారణంతో ఆసుపత్రిలోనే చేరడంతో.. ఆయన కొడుడు భరత్‌కు అండగా ఉన్నారు. రామకుప్పం మండలం ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీని 8,300(2014) నుంచీ 3,400(2019)కు తగ్గించగలిగారు. అయితే విద్యాసాగర్ ను హత్య చేయించాల్సిన అవసరం ఎవరికుందనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది.

  

Tags:    

Similar News