ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారణకు పాల్పడినట్టు ధృవీకరించిన KRMB

* డీపీఆర్‌కు అవసరమైన పనులకన్న అధికంగా జరిగినట్టు నిర్ధారించిన బోర్డు *ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్టు ధృవీకరించిన KRMB

Update: 2021-08-14 16:15 GMT

కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (ఫైల్ ఫోటో) 

KRMB: రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారణకు పాల్పడినట్టు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ధృవీకరించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను డీపీఆర్‌కు అవసరమైన దాని కన్న అధికంగా జరిగినట్టు బోర్డు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఎన్జీటీ తీర్పును ఏపీ ప్రభుత్వం ధిక్కరించినట్టు KRMB తేల్చింది. రెండు రోజుల పాటు ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన KRMB అధికారులు ఎన్జీటికి నివేదికను సమర్పించారు.

ప్రాజెక్టులో ముఖ్యమైన పనులను పూర్తి చేసినట్లు నివేదిక బోర్డు అధికారులు పొందుపరిచారు. పంప్ హౌస్, అప్రోచ్ చానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ చానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్టు నివేదికలో నిర్దారించారు. ఫొటోలతో సహా సమగ్ర నివేదికను KRMB అధికారులు ఎన్జీటీకి తెలిపారు. దీనిపై సోమవారం ఎన్జీటీ విచారణ జరపనుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని ఎన్జీటీ గతంలో మండిపడింది. 

Tags:    

Similar News