Corona Cases: కృష్ణా జిల్లా పెదపాలపర్రు పాఠశాలలో కరోనా కలకలం
* 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ * జలబు, జ్వరంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
Representation Photo
Krishna District: ఊహించిందే జరిగింది. కరోనా స్కూల్ కాంపౌండ్ దాటేసింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులకు కరోనా కన్‌ఫామ్ అయ్యింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా మంది విద్యార్థులు జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాఠశాలలో కరోనా టెస్ట్ లు చేయగా పది మంది స్టూడెంట్స్‌కి కరోనా నిర్ధారణ అయ్యింది. ఏడాది కాలంగా కరోనా కారణంతో స్కూళ్లు మూతపడ్డాయి. ఈ మధ్య కరోనా కేసులు కంట్రోల్‌లోకి రావడంతో ఈ నెల 16న పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. కానీ ఇప్పుడు కరోనా స్కూల్‌కి ఎంటర్ అవడంతో రెండు వారాలపాటు స్కూల్‌కి సెలవులు ప్రకటించారు.