టీడీపీలో చేరనున్న కోట్ల..

Update: 2019-03-26 01:13 GMT

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తమ్ముడి కుమారుడు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ్ముడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ కర్నూల్ లో పర్యటిస్తున్నారు. ఆయన సమక్షంలో హరిచక్రపాణి రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేరిన హరిచక్రపాణి రెడ్డి ఈసారి ఆ పార్టీ సీటు నిరాకరించడంతో గత ఏడాది బీజేపీలో చేరారు. అయితే ఆయన సోదరుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరడంతో ఆయన కూడా టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన చేరికకు గౌరు వెంకటరెడ్డి, టీజీ వెంకటేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. 

Similar News