నరక దారులుగా మారిన కోనసీమలోని రహదారులు

* అమలాపురం-బొబ్బర్లంక, ఈతకోట-పొదలాడ.. * అమలాపురం-గన్నవరం, అమలాపురం-సఖినేటిపల్లి రోడ్లు * వర్షాలకు నరక దారులుగా మారిన ప్రధాన రహదారులు * రాత్రుళ్లు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు

Update: 2020-12-25 12:15 GMT

 ప్రకృతి అందాల నడుమ ఉండే కోనసీమలోని రహదారులు నరక దారులుగా మారాయి. దీంతో కోనసీమ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రయాణికులు శారీరక సమస్యలతో సతమతమవుతున్నారు.

 కోనసీమ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అయితే ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలోని ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.

 ప్రధానంగా అమలాపురం-బొబ్బర్లంక, ఈతకోట-పొదలాడ, అమలాపురం-గన్నవరం, అమలాపురం-సఖినేటిపల్లి రోడ్లు గోతుల మయంగా మారాయి. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు నరక దారులుగా మారాయి. ద్విచక్రవాహనదారులు, ఆటోలు, బస్సులు, లారీల్లో ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అటు రాత్రి సమయాల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక రోడ్లు ప్రమాదభరితంగా ఉన్న పనులు చేసుకోవడానికి ప్రజలు ఆరూట్లో ప్రయాణించడం తప్పేటట్లులేదు. దీంతో రోడ్డులో నిత్యం ప్రయాణించే ప్రజలు శారీరక పరమైన సమస్యలకు గురవుతున్నారు. ఇటీవల వెన్నుముక, స్పాండిలైటిస్‌ నరాలకు సంబంధించిన సమస్యలతో వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని ఆర్థోపెడిక్‌ వైద్యులు చెబుతున్నారు. 

పనులు పూర్తిచేసుకోడానికి తప్పని ప్రయాణంస్పాండిలైటిస్‌ నరాలకు సంబంధించిన సమస్యలు... ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మత్తులు చేయాలని కోనసీమ ప్రజలు కోరుతున్నారు. రోడ్లను అభివృద్ధి చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News