అసెంబ్లీ నాకు దేవాలయం..ఐదేళ్లు పూజారిగాపని చేశా

అసెంబ్లీ ఫర్నిచర్‌ను వాడుకున్నారన్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

Update: 2019-08-21 05:38 GMT

అసెంబ్లీ ఫర్నిచర్‌ను వాడుకున్నారన్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలించారని అందులో కొంత ఫర్నీచర్‌ను తన కార్యాలయంలో వినియోగించుకున్నానన్నారు. అయితే ఫర్నీచర్ తిరిగి తీసుకెళ్లమని గతంలోనే అసెంబ్లీ అధికారులకు లేఖలు రాసినా ఎవరూ స్పందించ లేదన్నారు. అధికారులు ఇప్పటికైనా వస్తే ఫర్నీచర్‌ను అప్పగిస్తానని లేని పక్షంలో ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తాని స్పష్టం చేశారు.

అసెంబ్లీ తనకు దేవాలయం లాటిందన్నారు కోడెల. ఐదేళ్లుగా పూజారిగా పని చేశానన్నారు. అసెంబ్లీ రికార్డులుంటాయి ఏమైనా అనుమానాలుంటే వాటిని పరిశీలించుకోవచ్చనన్నారు. సీఎం జగన్‌పాలనపై మండిపడ్డ ఆయన ప్రజలు మీకు పాలన చేయడానికి అధికారం ఇచ్చారని అమరావతి, పోలవరం నాశనం చేయడానికి అధికారం ఇవ్వలేదన్నారు. ప్రజల దృష్టి మళ్ళించాడాన్ని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏ విచారణకైనా తాను సిద్ధమేనన్నారు.

Full View 

Tags:    

Similar News