కోడెలలో సూసైడల్ టెండెన్సీ కనపడిందా..అయినా కుటుంబ సభ్యులు గుర్తించలేక పోయారా?

Update: 2019-09-18 15:24 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల గత కొన్నాళ్లుగా సూసైడల్ టెండెన్సీతో బాధపడుతున్నారని పోలీసులు తేల్చారు. కొన్నాళ్లుగా ఆయన హై డోస్ మెడిసిన్స్ వాడుతున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గతంలో నర్సరావు పేటలోకూడా ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు దాదాపు 30 నిద్రమాత్రలు మింగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే అప్పట్లో దానిని గుండెనొప్పిగా చెప్పి కుటుంబ సభ్యులు తమ బంధువుల ఆస్పత్రిలోనే చేర్చి ట్రీట్ మెంట్ ఇప్పించారు. అప్పటినుంచీ కోడెల తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

20 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన కోడెల అప్పట్నుంచి ఇంటికే పరిమితమైపోయారు. హైదరాబాద్ లో ఆయన ఎవరినీ కలిసింది లేదు. ఇంట్లో కూడా ముభావంగానే ఉంటూ వచ్చారు. ఆత్మహత్యకు ముందు రోజు ఆయన దాదాపు 12 కాల్స్ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. ఆ కాల్ డాటా వివరాలు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది.

సోమవారం ఉదయం ఆయన 24 నిమిషాలపాటూ ఒక కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ కాల్ ఎవరితో? ఏం మాట్లాడారు అన్నది కీలకంగా మారింది. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం సేవించిన కోడెల ఆ తర్వాత తన ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే అప్పటికే ఆయన ఆత్మహత్యపై ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారా? ముందుగా తాను కట్టుకున్న పంచెతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించిన కోడెల కుదరకపోవడంతో ఆ తర్వాత కేబుల్ వైర్ తో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో చింపి తాడులా చేసిన పంచె ఆనవాళ్లు దొరికాయి. అదే గదిలో కోడెల కొంత కాలంగా వాడుతున్న హై డోస్ మెడిసన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోడెల కేసులో ఆయన భార్య, కూతురు, డ్రైవర్, గన్ మెన్ ను సాక్షులుగా చేర్చిన పోలీసులు త్వరలోనే కొడుకు శివరాంను ప్రశ్నించనున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మందిని విచారించారన్నారు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్లు రికార్డు చేశామని చెప్పారు. కోడెల ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నామని కోడెల పోస్ట్ మార్టం ఇంకా రిపోర్టు రావాల్సి ఉందన్నారు. కోడెల ఆత్మహత్యకు కారణమైనట్లుగా భావిస్తున్న మొబైల్ సంభాషణ ఏంటి? అసలు మొబైల్ ఎలా మిస్సయ్యింది? ఆ మొబైల్ లో కోడెల ఏదైనా ఆడియో, వీడియో రికార్డు చేశారా? అందుకే దానిని మాయం చేశారా? అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొబైల్ దొరికితే తప్ప ఈ కేసు మిస్టరీ వీడే ఆస్కారం కనిపించడం లేదు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల ఒత్తిడితోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని, ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించిందని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనీ ఆరోపిస్తున్నారు విజయలక్ష్మి ఇదే కేసులో కోడెల కొడుకు శివరాం ను కూడా పోలీసులు విచారించనున్నారు.

Full View

Tags:    

Similar News