Kodali Nani: జూమ్‌లో నేను కనపడగానే లోకేష్ పారిపోయాడు..ఫెయిల్ అయిన విద్యార్థులతో రాజకీయాలు ఏంటి..?
Kodali Nani: లోకేష్ టెన్త్ పరీక్షలపై మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.
Kodali Nani: జూమ్‌లో నేను కనపడగానే లోకేష్ పారిపోయాడు..
Kodali Nani: లోకేష్ టెన్త్ పరీక్షలపై మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. తండ్రీకొడుకులు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నట్లు చెప్పారు ఆయన. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. విద్యార్థి మేనమామతో లోకేష్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తాను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయారని అన్నారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెబితే బాగుండేదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులతో టీడీపీకి రాజకీయాలు ఏంటి అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని.