సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొడాలి నాని ఫొటో
Kodali Nani: కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొడాలి నాని ఫొటో
Kodali Nani: కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. తనకు మంత్రిపదవి అక్కర్లేదని, పార్టీ తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని ఇదివరకే క్లారిటీ ఇచ్చిన నానిలో మునుపటి హుషారు, మునుపటి జోరు మాత్రం కనిపించడం లేదు. కేబినెట్ మంత్రిగా చేసిన ఆయనకు కేబినెట్ ర్యాంకుతో సమానమైన మరో పదవిని ముఖ్యమంత్రి జగన్ కట్టబెడతానని హామీ ఇచ్చినా నాని మాత్రం కన్విన్స్ కాలేకపోతున్నారు. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని జగన్ చెప్పినా తనకు ఏ పదవీ వద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పదవి పోయాక ప్రభుత్వ వ్యవహారాల నుంచి తప్పుకున్న నాని ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. సొంత పనులు కల్పించుకొని బిజీగా కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఆయన ముఖంలో ఆనందపు జాడలు మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా ఆయన పశువుల కొట్టాంలో చింతాక్రాంతుడై ఉన్న నాని ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫొటో చాలు ఆయన మనసులో భావాలకు అర్థం చేసుకోవాడనికి అంటున్నారు నెటిజన్లు.