Kodali Nani: 14 నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ మాదే పైచేయి
Kodali Nani: ఎన్నికల్లో అన్ని స్థాలను వైసీపీ కైవసం చేసుకుంటుంది
Kodali Nani: 14 నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ మాదే పైచేయి
Kodali Nani: సాధారణ ఎన్నికలకు సమాయాత్తమయ్యే ముందు జరగబోయే స్థానిక సంస్థల ఉపఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యాన్ని నిర్ధేశించారని పేర్కొన్నారు. ఈక్రమంలో పార్టీ పరంగా నిర్వహించిన సంస్థాగత సర్వేలో 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ విచారం వ్యక్తంచేశారని తెలిపారు. పార్టీ అధినేతకు ఏదోకారణాలను చెప్పి తప్పించుకున్నప్పటికీ అన్నీ ఆయనకు తెలుసనే అభిప్రాయం వ్యక్తంచేశారు.