YV Subba Reddy: శ్రీవాణి ట్రస్ట్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. పలు అభివృద్ధి పనులకు రూ.250 కోట్ల నిధులు
TTD: రూ.4.15 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ రూ.1.68 కోట్లతో వసతి గృహాల ఆధునీకరణ
YV Subba Reddy: శ్రీవాణి ట్రస్ట్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. పలు అభివృద్ధి పనులకు రూ.250 కోట్ల నిధులు
TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులకు దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 4 కోట్ల 15 లక్షల రూపాయలతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోటి 68 లక్షలతో వసతి గృహాలను ఆధునీకరిస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీకి మూడు సంవత్సరాల కాలపరిమితికి అనుమతి ఇచ్చింది టీటీడీ.
ఇక కడప జిల్లా ఒంటిమిట్టలో దాతల సాయంతో 4 కోట్లతో నూతన అన్నదాన భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి ఎస్వీ వర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి 5 కోట్లు రూపాయలు కేటాయించిన పాలకమండలి. స్విమ్స్ నిర్వహణను పూర్తి స్థాయిలో టీటీడీ తీసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. 12 వందల పడకలతో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, 97 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరుగుతోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అబద్ధపు ప్రచారాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే గొప్ప లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చామని. ట్రస్ట్ ద్వారా 2 వేల 600 ఆలయాల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ నడుపుతుంటే, రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై న్యాయ సలహా మేరకు కఠిన చర్యలు తీసుకుంటాంమన్నారు వైవీ సుబ్బారెడ్డి.