AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 6100 పోస్టులతో డీఎస్సీ 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం
AP Cabinet Meeting: ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5వేల కోట్ల మేర నిధులు విడుదల
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 6100 పోస్టులతో డీఎస్సీ 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం
AP Cabinet Meeting:ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.