జగన్‌కు సడన్ సర్‌ప్రైజ్.. నేడు అమరావతికి కేసీఆర్..

Update: 2019-06-17 01:55 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మరోసారి విజయవాడకు వెళ్లనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కృష్ణా తీరాన జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ కూడా రానుండటంతో ముగ్గురి మధ్య మరోసారి కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బెజవాడకు వెళ్తున్నారు. మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌ తో సమావేశంకానున్నారు. ఈ నెల 21 న నిర్వహించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకకు స్వయంగా ఆహ్వానించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు విమానంలో బయల్దేరనున్న కేసీఆర్‌ మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాలకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత 2 గంటలా 30 నిమిషాలకు తాడేపల్లిలో జగన్‌ నివాసానికి వెళతారు. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవుతారు. తర్వాత కేసీఆర్‌కు జగన్ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.

ఆ తర్వాత సాయంత్రం ఇద్దరూ కలిసి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరవుతారు. ఇదే కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ కూడా హాజరుకానున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు కలిసి మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. విభజన సమస్యల్లో కొలిక్కి రాని అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, షెడ్యూల్‌ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన వంటి అంశాలపై చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో పూర్తైంది. దీని ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీజ్‌ను ఆహ్వానించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.  

Full View

Tags:    

Similar News