Vijaysai Reddy: నెహ్రూ తప్పిదాల వల్లే కాశ్మీర్ సమస్య
Vijaysai Reddy: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో సత్ఫలితాలు వచ్చాయి
Vijaysai Reddy: నెహ్రూ తప్పిదాల వల్లే కాశ్మీర్ సమస్య
Vijaysai Reddy: నెహ్రూ తప్పిదాల వల్లే కాశ్మీర్ సమస్య ఉత్పన్నమైందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. నెహ్రూ తప్పిదాల వల్లే కాశ్మీర్ ఏడు దశాబ్దాలుగా అల్లకల్లోలంగా తయారైందన్నారు. కాశ్మీర్ పండిట్లు ఘోరంగా నష్టపోయారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి నివేదించడం నెహ్రూ చేసిన అతి పెద్ద తప్పు అని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో యుద్ధం గెలిచిన సమయంలో కాశ్మీర్ ను సంపూర్ణంగా కలిపే అవకాశాన్ని నెహ్రూ జారవిడిచారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు మెరుగయ్యాయని... శాంతిభద్రతలన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ బిల్లుపై రాజ్యసభ చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. విజయసాయి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.