జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా

జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫ్యాక్షన్ చరిత్రను జగన్ కొనసాగిస్తున్నారని విమర్శించారు.

Update: 2020-02-19 14:11 GMT
Kanna LAkshminarayana File Photo

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ సర్కార్ పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం లాగానే జగన్‌ సర్కార్ కూడా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కడప జిల్లాలో బుధవారంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్‌పై వైసీపీ నాయకులు పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ.. బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన కన్నా.. ముఖ్యమంత్రి జగన్‌ తన ఫ్యాక్షన్‌, రాజకీయ చరిత్రను కొనసాగిస్తున్నారని కన్నా విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ గూండాలు చేస్తున్న అరాచకాలు ఎక్కువైయ్యాని కన్నా మండిపడ్డారు. అనంతరం కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పీపీఏల పరిస్థితి రాష్ట్రంలో ఏవిధంగా అమలవుతోందో అర్థం అవుతోందని ఆమె అన్నారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించకుండా.. సీఎం జగన్‌ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులు పెడుతున్న కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి కన్నా లక్ష్మీనారాయణతోపాటు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News