ఆ ప్రాజెక్టుకు జనవరి 26న శంకుస్థాపన..!

Update: 2019-12-05 01:11 GMT

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మెడికల్ కాలేజీని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే, అధికారులు ప్రస్తుతం మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా కలెక్టర్ సి హరికిరన్‌తో పాటు పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనిల్ కుమార్ రెడ్డితో పాటు తహశీల్దార్ శ్రీనివాసులు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సమీపంలో 22 ఎకరాల భూమిని పరిశీలించారు. మెడికల్ కాలేజీకి నిర్మాణానికి ఈ భూమి అనువైనదిగా గుర్తించారు. కాగా జనవరి 26న ముఖ్యమంత్రి పులివెందులకు రానున్నారు. ఈ సందర్బంగా మెడికల్ కాలేజీకి పునాది రాయి వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి ఇటీవలి జరిపిన సమీక్షలో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ మరియు ఇతర అధికారులకు వైద్య కళాశాలకు అనువైన భూమిని సేకరించాలని ఆదేశించారు. పులివెందుల నియోజకవర్గాన్ని తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ వద్ద వైయస్ఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) ను ఏర్పాటు చేసిందన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News