ఇడుపులపాయ ఐఐఐటిలో 30 మంది విద్యార్థులకు జ్వరాలు

Update: 2019-11-05 01:50 GMT

కడప జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వద్ద ఉన్న ఐఐఐటిలో 30 మంది విద్యార్థులు అశ్వత్థకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా వారంతా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అంతేకాదు నీటికాలుష్యం వలన వారికి ఈ సమస్య మరింత జటిలం అవుతోంది. దాంతో వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఐఐఐటి ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రికి రోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు జ్వరాలతో వస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ హసన్ అలీ మాట్లాడుతూ.. అనేక మంది విద్యార్థులు మలేరియా, టైఫాయిడ్ మరియు ఇతర జ్వరాలతో బాధపడుతున్నారని అంగీకరించారు. అయితే, ఆసుపత్రిలో టెస్ట్ కిట్లు అందుబాటులో లేనందున వారు డెంగ్యూతో బాధపడుతున్నారో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉందని ఆయన అన్నారు.

దీనిపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మరోవైపు విద్యార్థులను ఇంటికి పంపిస్తే వారి చదువులకు ఇబ్బంది వాటిళ్లుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వారి ఆరోగ్య బాధ్యతను చూసుకోవాల్సిన అవసరం యజమాన్యాయానికి ఉందని.. వైద్య సదుపాయాలను ఏర్పాటు చెయ్యాలని వారు కోరుతున్నారు. కాగా కడప, ఒంగోల్ IIIT లలో సుమారు 9,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. 

Tags:    

Similar News