Jogi Ramesh: టీడీపీ, జనసేన కలవడం పాయిజన్‌తో సమానం
Jogi Ramesh: 2024 తర్వాత పవన్‌కల్యాన్‌తో సినిమా తీస్తా
Jogi Ramesh: టీడీపీ, జనసేన కలవడం పాయిజన్‌తో సమానం
Jogi Ramesh: జనసేన అధినేత పవన్‌కల్యాన్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీ కలయిక ఓ వైరస్ లాంటిదని.. చంద్రబాబు, పవన్‌లు కలవడం పాయిజన్‌తో సమానమంటూ ఆరోపించారు. ప్రజలకు పవన్‌పై విశ్వసనీయత లేకనే రెండు చోట్ల ఓడించారని ఆరోపించారు. పవన్ సభకు పట్టుమని 2 వేల మందికూడా రాలేదని విమర్శించారు. 2024 తర్వాత పవన్‌కల్యాన్‌తో సినిమా తీస్తానంటూ సవాల్ చేశారు మంత్రి జోగి రమేష్. జానీ-కూనీ, గబ్బర్‌సింగ్-రబ్బర్‌సింగ్ సినిమాలు తీస్తానని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత పవన్ సినిమాలకే పరిమితం అవుతారని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.