పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన జేసీ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కాగా , పోలీసులపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో బూట్లు నాకిస్తా గంజాయి కేసులు పెడతాం అంటూ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో 153, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సొంత పూచీకత్తుతో రెండు సార్లు పోలీసు స్టేషన్ కు సంతకం చేయాలని కోర్టు షరతులు విధించింది.