ఇళ్లలో దీక్షలతో ఉపయోగం లేదు.. సొంత పార్టీ వాళ్లపై జేసీ కామెంట్స్.. జగన్ శ్రీరాముడో, రావణుడో తేల్చుకోవాలి

ఇళ్లలో దీక్షలు, నిరసనలతో ఉపయోగం లేదని, సొంత పార్టీ నేతలపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు.

Update: 2020-05-30 05:26 GMT
JC diwakar reddy(File photo)

ఇళ్లలో దీక్షలు, నిరసనలతో ఉపయోగం లేదని, సొంత పార్టీ నేతలపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 21న నిరసనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నాయకులు వారి ఇళ్లలోనే ఉండి నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జేసీ దివాకరరెడ్డి మాట్లాడుతూ.. జగన్ చేసే ప్రతి పనిని విమర్శించాల్సిన అవసరం లేదని, ఓ పూట నిరసనలతో ఏం ఒరిగిందన్నారని అన్నారు.

జగన్ ఏడాది పాలన కూడా ఆయన స్పందించారు. ఏపీకి జగన్ వంటి సీఎం మళ్లీ దొరకడని.. ఏడాది పాలనకు వందకు 110మార్కులు వేస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమంపై జగన్ ఫోకస్ పెట్టారని, కానీ సంక్షేమ పథకాలను 2019 ఎన్నికల్లో ఆదరించలేదన్నారు. ఎన్నికలకు ముందు తాను అనంతపురం జిల్లాలో పర్యటించానని అక్కడ ప్రజల్ని అడిగితే టీడీపీకి ఓటు వేస్తామని చెప్పారని, కానీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

నిమ్మగడ్డ రమేష్ కేసులో హైకోర్టు తీర్పుపై ఆసక్తిర మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం ఉందని జేసీ దివాకరరెడ్డి అన్నారు. జగన్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనడం సరికాదని.. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయన్నారు దివాకర్‌రెడ్డి.

జగన్ ధోరణి చూస్తే చట్టం లేదు, తాను చెప్పిందే జరిగి తీరాలి అనే విధంగా ఉందని అన్నారు. 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పదే, పదే గుర్తు చేస్తున్నారన్నారు. ఇదంతా నియంతృత్వ ధోరణి ఉందని.. పట్టుదల ఉంటే జగన్ పేరు చెప్పుకోవాలన్నారు. అది మరీ పరాకాష్టకు పోయి నియంతృత్వంగా మారిందన్నారు. జగన్ శ్రీరాముడో, రావణుడో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. 

Tags:    

Similar News